తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లష్కరే తోయిబా కమాండర్‌ జహిద్‌ టైగర్‌ హతం - జహిద్ టైగర్ ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్‌ కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా.. వీరిలో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా సంస్థలకు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఒకరిని అదుపులోకి తీసుకుంది.

lashkar e taiba commander zahid nazir bhat killed in encounter
లష్కరే తోయిబా కమాండర్‌ జహిద్‌ టైగర్‌ హతం

By

Published : Oct 11, 2020, 7:21 AM IST

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ టైగర్‌ కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. రెండు చోట్ల వేర్వేరుగా జరిగిన ఎన్‌కౌటర్‌లో జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ముష్కర గ్రూపులకు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అలాగే, ఒక మిలిటెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కుల్గాం జిల్లాలోని చింగాం వద్ద మిలిటెంట్లు ఉన్నారన్న సమాచారంతో సైన్యం సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సైనికులపైకి ముష్కరులు కాల్పులు జరిపారు. ఇది ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. అలాగే, దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా దాదూర ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో కూడా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ జహిద్‌ నజీర్‌ భట్‌ అలియాస్‌ జహిద్‌ టైగర్‌ హతమైనట్టు ప్రకటించారు. అతడిని మట్టుబెట్టడం సైన్యానికి పెద్ద విజయంగా అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details