అక్రమ వలసదారులకోసం దేశంలోనే అతి పెద్ద నిర్బంధ కేంద్రాన్ని అసోంలోని గోల్‌పరా జిల్లాలో నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం 28వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.
గోల్‌పరా జిల్లాలోని మటియా ప్రాంతంలో ఈ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ కల్లా పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కేంద్రం నిర్మాణం కోసం హోంశాఖ రూ.46.5 కోట్లు వెచ్చించింది.
కనీసం 3 వేల మంది ఆవాసం ఉండే విధంగా 15 అంతస్తుల భవనం, పాఠశాలలు, ఆసుపత్రులు, సమావేశ మందిరాలు, 7 ఫుట్బాల్ కోర్టులు, 180 మరుగుదొడ్లు ఇలా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా దీనిని నిర్మిస్తున్నారు.