మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాకిస్థాన్ చేసిన కుట్రలను భగ్నం చేసింది సరిహద్దు రక్షక దళం(బీఎస్ఎఫ్). దేశంలోకి తరలిస్తున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్‌లోకి వీటిని చేరవేస్తుండగా.. శనివారం అర్ధరాత్రి జమ్ముకశ్మీర్ ఆర్నియా ప్రాంతంలో గుర్తించింది బీఎస్ఎఫ్. రెండు పిస్తోళ్లు, 4 మ్యాగజైన్లతో పాటు 58 ప్యాకెట్ల డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ఈ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిపింది.