భూసేకరణ- పరిహారం అంశంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మరింత స్పష్టత అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రశ్నలపై చర్చించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
" ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకున్నా పరిహారం చెల్లించకపోయినా భూసేకరణ అమలులో ఉంటుందని ధర్మాసనం చెప్పింది. ఇలా ఎంతకాలం ఉంటుంది? అప్పుడు యజమాని నష్టపోతారు కదా!" ఇలాంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ బొబ్డే వ్యాఖ్యానించారు.