జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. నైతిక విలువలను కోల్పోయారని ఆర్జేడీ(రాష్ట్రీయ జనతాదళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. అధికార దాహంతో తమను వంచించారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల ప్రచార వీడియోను విడుదల చేశారు.
" అధికారం మోజులో పడి బిహార్‌ను సమస్యల వలయంలో నితీశ్ కుమార్ పడేశారు. 2010 ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకుని మెజారిటీ సాధించారు. 2015 ఎన్నికల్లోనూ గెలిచాక మమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేశారు. "