బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఆయనకు ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది.
లాలూ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ను గుర్తించినట్టు వైదులు వెల్లడించారు. ఇది ఓ రకమైన న్యుమోనియా అని పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స చేస్తున్నట్టు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వివరించారు.
అయితే లాలూకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో కొవిడ్ నెగిటివ్గా తేలగా.. ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు స్పష్టం చేశారు వైద్యులు.