తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో ఏసీ పనిచేయక లాలూ ఇక్కట్లు

రాంచీ రిమ్స్ ఆసుపత్రి గదిలో ఏసీ పనిచేయక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులిచ్చినా ఏసీ ఎందుకు బాగు చేయించరంటూ ఆస్పత్రి వర్గాలపై మండిపడ్డారు.

లాలూకు భానుడి సెగ

By

Published : May 12, 2019, 1:14 PM IST

Updated : May 12, 2019, 6:44 PM IST

ఆస్పత్రిలో ఏసీ పనిచేయక లాలూ ఇక్కట్లు

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​కు భానుడి సెగ తగిలింది. రాంచీ రిమ్స్​ ఆస్పత్రిలో ఆయన ఉంటున్న వార్డులో ఏసీ పనిచేయడం లేదు. వేసవి వేడికి ఏసీ సమస్య తోడవడం లాలూను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే ఆయన వైద్యుడికి ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్​ రూపంలో రూ.2 లక్షల 40వేలు ఇచ్చినా... ఏసీ ఎందుకు బాగు చేయించరని నిలదీశారు లాలూ.

"పేయింగ్ వార్డ్​లోని తన గదిలో గత 3 రోజులుగా ఏసీ పనిచేయట్లేదన్నారు. ఆసుపత్రి పర్యవేక్ష​కునికి ఇదే అంశంపై ఫిర్యాదు చేశాం. మరమ్మతు చేయిస్తామని సూపరిండెంట్ చెప్పారు. ఈ ఒక్క మాటే లాలూ నాతో చెప్పారు. డబ్బులిస్తున్నా ఏసీ పనిచేయట్లేదని లాలూ ఫిర్యాదు చేశారు. ఆయన వేడి వల్ల ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు. వేసవి రోజులు. అనారోగ్యంతో ఉన్నారు."
-డాక్టర్ ఉమేశ్​ ప్రసాద్, వైద్యుడు.

లాలూ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని రిమ్స్​ వైద్యులు తెలిపారు.

జైలుకు బదులు ఆస్పత్రిలో...

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్​కు జైలుశిక్ష పడింది. గతేడాది ఆగస్టులో ఆయన లొంగిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో లాలూను జైలు నుంచి రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు.

రిమ్స్​లో తాను ఉండే గది వద్ద కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటి అరుపులకు నిద్ర పట్టడంలేదని గతంలో ఫిర్యాదు చేశారు లాలూ. ఆ తర్వాత ఆయన్ను ప్రస్తుతమున్న పేయింగ్​ వార్డ్​కు మార్చారు.

Last Updated : May 12, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details