"గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అక్కడి నుంచి జాతీయ నాయకులు పోటీ చేయాలని వారు కోరుకుంటున్నారు"
-- గాంధీ నగర్ భాజపా వ్యవహారాల పర్యవేక్షకుడు నిమబెన్ ఆచార్య
అక్కడి నుంచే 6 సార్లు...
గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి 6 సార్లు గెలుపొందారు అడ్వాణీ. మొదట 1991లో అక్కడి నుంచి విజయం సాధించారు. బాబ్రీ కేసు కారణంగా 1996లో పోటీ చేయలేదు. అప్పుడు మాజీ ప్రధాని వాజ్పేయీ అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గాంధీ నగర్ నుంచి జయకేతనం ఎగురవేశారు అడ్వాణీ.
"ఆయన(అడ్వాణీ) ఇంకా నిర్ణయించుకోలేదు. పోటీ చేయాలని పార్టీ కోరినప్పుడు ఆలోచిస్తారు"
-- ఎల్కే అడ్వాణీ వ్యక్తిగత కార్యదర్శి
భాజపాను వెలుగులోకి తెచ్చిన నేత
అయోధ్యలో రామమందిరం కోసం 1992లో అడ్వాణీ రథయాత్ర చేపట్టారు. అది దేశ రాజకీయాలను మలుపు తిప్పింది. భాజపాకు విశేష మద్దతు తెచ్చిపెట్టింది. ఆయన చేసిన రామజన్మభూమి ఉద్యమం కమలదళాన్ని అధికార పీఠం వైపు నడిపించింది.
అడ్వాణీ, వాజ్పేయీ కృషితో తొలిసారి 1996లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బలం నిరూపించుకోలేక 13రోజుల్లోనే పడిపోయింది. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ అధిక స్థానాలు భాజపావే. అప్పుడు మిగిలిన పార్టీలను కూడగట్టి... ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అడ్వాణీది కీలకపాత్ర. అలా ఏర్పాటైన వాజ్పేయీ ప్రభుత్వంలో హోంమంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు అడ్వాణీ. పార్టీని అన్నీ తానై నడిపారు.
మోదీ రాకతో...