తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లొంగిపోయిన లలితా జ్యూవెలరీ చోరీ ప్రధాన నిందితుడు - surrenders

తమిళనాడు తిరుచ్చి లలితా జ్యూవెలరీ షోరూంలో జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్..​ కోర్టులో లొంగిపోయాడు. తిరుచ్చి పోలీసులు అతడిని కస్టడిలోకి తీసుకుని విచారించనున్నారు.

లొంగిపోయిన లలితా జ్యూవెలరీ చోరీ ప్రధాన నిందితుడు

By

Published : Oct 11, 2019, 9:08 AM IST

తమిళనాడులోని తిరుచ్చి లలితా జ్యూవెలరీ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడు, 'మనసా వినవే', 'ఆత్మ' సినిమాల కథానాయకుడు సురేశ్..​ కోర్టులో లొంగిపోయాడు. రూ. 13 కోట్ల విలువైన ఆభరణాల చోరీ ఘటన ఈ నెల 2న జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేసి 5 కిలోల ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సురేశ్​తో పాటు ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న మురుగన్​ తెలుగు రాష్ట్రాల్లో తలదాచుకుని ఉండొచ్చని భావించి ఓ పోలీసు బృందం అక్కడికి వెళ్లింది.

తిరువణ్ణామలై జిల్లా చెంగం కోర్టులో మేజిస్ట్రేట్​ విఘ్నేష్​ ప్రభు ఎదుట గురువారం మధ్యాహ్నం సురేశ్​ లొంగిపోయాడు. న్యాయస్థానం అతడికి 15రోజులు రిమాండ్​ విధించారు. పోలీసులు సురేశ్​ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: గోడకు కన్నం వేసి.. లలితా జ్యువెలరీలో భారీ చోరీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details