తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై గొంతు కోసి.. - minor rape case

ఉత్తర్​ప్రదేశ్​ లఖీంపుర్​ ఖేరీలో మూడేళ్ల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించారు దుండగులు. అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశారు. బుధవారం కనిపించకుండా పోయిన చిన్నారి.. సమీప పొలాల్లో మరుసటి రోజు శవమై కనిపించింది.

MINOR RAPE
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

By

Published : Sep 4, 2020, 11:52 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపుర్‌ ఖేరీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి గొంతుకోసి చంపేసిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. గత బుధవారం కనిపించకుండా పోయిన చిన్నారి.. మరుసటి రోజు ఇంటికి సమీపంలోని చెరకు తోటలో శవమై కనిపించింది.

శవపరీక్ష నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. పాత కక్షల కారణంగా తన పక్క గ్రామానికి చెందిన వ్యక్తే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడో ఘటన..

లఖీంపుర్‌ ఖేరీ జిల్లాల్లో 20 రోజుల వ్యవధిలో మైనర్లపై జరిగిన మూడో అత్యాచారం- హత్య ఘటన అని పోలీసులు వెల్లడించారు. వరుస ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:2,400 మీటర్ల ఎత్తయిన ప్రాంతంలో విషసర్పం

ABOUT THE AUTHOR

...view details