కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. చైనా చొరబాట్లపై లద్దాఖీ ప్రజలు చేసిన హెచ్చరికల పట్ల మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహించిందని పరోక్ష విమర్శలు చేశారు.
భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారంటూ లద్దాఖ్ స్థానిక ప్రజలు నినాదాలు చేస్తున్న వీడియోను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలోపోస్టు చేశారు.
"దేశభక్తులైన లద్దాఖీలు చైనా చొరబాట్లకు వ్యతిరేకంగా తమ స్వరం వినిపిస్తున్నారు. వారి హెచ్చరికలను విస్మరిస్తే.. అది భారతదేశానికే చేటు తెస్తుంది."