వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. తమ భూములను చైనా స్వాధీనం చేసుకుందని లద్దాఖ్ ప్రజలు పేర్కొంటున్నారని.. నరేంద్ర మోదీ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారని ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఎవరు అబద్ధం చెబుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. సదరు వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు రాహుల్.
సరిహద్దు వద్ద ప్రతిష్టంభనలపై ప్రధాని మోదీ వాస్తవాలను దాస్తున్నారని ఆరోపించారు రాహుల్.