తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లద్దాఖ్​ ప్రతిష్టంభన'పై చర్చల పునరుద్ధరణ - భారత్​-చైనా మధ్య చర్చల పునరుద్ధరణ

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి త్వరితగతిన బలగాల ఉపసంహరణ చేపట్టేలా చర్యలు కొనసాగించాలని భారత్​, చైనా నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య శుక్రవారం జరిగిన దౌత్యస్థాయి వర్చువల్​ సమావేశంలో సరిహద్దు పరిస్థితులపై సమీక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Ladakh standoff
'లద్దాఖ్​ ప్రతిష్టంభన'పై చర్చల పునరుద్ధరణ

By

Published : Dec 18, 2020, 8:06 PM IST

భారత్​, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించాయి ఇరు దేశాలు. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సత్వరం బలగాల ఉపసంహరణ చర్యలు చేపట్టేలా చర్యలు కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్' (డబ్ల్యూఎంసీసీ) పద్ధతిలో ఇరు దేశాల మధ్య శుక్రవారం వర్చువల్​గా చర్చలు జరిగాయి.

" తదుపరి మిలిటరీ స్థాయి సమావేశం అనుకున్న దానికంటే ముందుగానే నిర్వహించాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సైనిక స్థాయి సమావేశం ద్వారా.. ద్వైపాక్షిక ఒప్పందాలు, నియమాలను అనుసరించి సత్వర, సంపూర్ణ బలగాల ఉపసంహరణ దిశగా వీలైనంత వేగంగా కృషి చేయొచ్చు. సెప్టెంబర్​ 30న జరిగిన డబ్ల్యూఎంసీసీ సమావేశం తర్వాత ఎల్​ఏసీ వెంబడి పరిస్థితులపై ఇరు దేశాలు సమీక్షించాయి. "

- భారత విదేశాంగ శాఖ

ఇదీ చూడండి:'మరో దఫా చర్చలతోనే చైనాతో వివాదం పరిష్కారం'

ABOUT THE AUTHOR

...view details