తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా.. భారత్-చైనా మధ్య సోమవారం ఆరోసారి కమాండర్ స్థాయిలో చర్చలు జరగునున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా పరిధిలో ఉన్న మోల్డోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. తొలిసారిగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.
కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరగునున్న ఈ భేటీలో ఫింగర్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉద్రిక్తతలు పెరిగే చర్యలను నివారించడం, సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి బలగాలను సత్వరం వెనక్కి తీసుకోనే అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
20 వ్యూహాత్మక పర్వతాల్లో భారత్ ఆధిపత్యం..