సరిహద్దు ప్రాంతంలో భారత్, చైనా సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. లద్దాఖ్‌లోని ఉత్తర ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో బుధవారం ఉదయం ఇరుదేశాల సైనికులు పరస్పరం బాహాబాహికి దిగారు. అయితే, ఇరుదేశాల సైన్యం మధ్య ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. చర్చల అనంతరం పరిస్థితి కాస్త సద్దుమణిగింది.
భారత్ X చైనా: మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు - ఉద్రిక్తతలు
భారత్-చైనాల మధ్య మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఇరుదేశాల సైన్యాలు బాహాబాహికి దిగాయి. భారత్ సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 'పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ చైనా' సైనికులు ఘర్షణ పడ్డారు. ఇది తమ భూభాగమంటూ ఇరుసైన్యాలు ఒకరినొకరు తోసుకున్నారు.

134 కిలోమీటర్ల ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద భారత సైన్యం బుధవారం ఉదయం గస్తీ నిర్వహిస్తుండగా.. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) జవాన్లు అక్కడికి వచ్చి.. ముఖాముఖి తలపడ్డారు. సరస్సు వద్ద భారత సైన్యం గస్తీ నిర్వహించడంపై పీఎల్‌ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్ నుంచి లద్దాఖ్ వరకూ ఉన్న ఈ ప్రాంతం మూడింట రెండొంతులు చైనా అధీనంలో ఉంది.
పీఎల్‌ఏ అభ్యంతరంతో ఇరుదేశాల సైనికుల మధ్య గొడవ ప్రారంభమయింది. అయితే బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరపడం వల్ల ఈ ఉద్రికతలకు తెరపడింది. 2017లోనూ ఇక్కడ భారత్-చైనా సైన్యాలు తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం సైనికులు కొట్టుకున్నారు.
- ఇదీ చూడండి: 'ఆవుల గురించి కాదు ఆర్థిక వ్యవస్థపై మాట్లాడండి'