తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాతో వివాదంపై 19న అఖిలపక్ష భేటీ - indo china border situation latest news

సరిహద్దు వివాదంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 19న అన్ని పార్టీల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు.

Ladakh face-off:PM convenes all-party meeting on Friday
అఖిలపక్ష పార్టీల సమావేశానికి ప్రధాని పిలుపు

By

Published : Jun 17, 2020, 2:42 PM IST

చైనా సరిహద్దులో పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 19న వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు మోదీ.

అఖిలపక్ష పార్టీల సమావేశానికి ప్రధాని పిలుపు

"భారత్​-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష పార్టీ సమావేశానికి పిలుపునిచ్చారు. జూన్​ 19న సాయంత్రం 5 గంటలకు వర్చువల్​ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటారు."

-ప్రధానమంత్రి కార్యాలయం

సరిహద్దు వివాదంపై స్పందించాలని మోదీని ఇప్పటికే పలువురు డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలోనే సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో నెత్తురు చిందింది. ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య సరిహద్దు వైరం మరింత ముదిరింది. తూర్పు లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా కవ్వింపు చర్యలు సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ దారితీసింది. ఇందులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరి కొంతమంది గాయపడ్డారు. చైనా సైనికులూ 43 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఇదీ చూడండి:'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

ABOUT THE AUTHOR

...view details