తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనా దుశ్చర్యల పట్ల మన్మోహన్ ప్రేక్షక పాత్ర' - ప్రధాని మన్మోహన్​ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​పై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీఏ పాలనలో చైనాకు భారత భూభాగాన్ని అప్పగించి, మన్మోహన్​ లొంగిపోయారని ఆరోపించారు. ఎన్ని దాడులు జరిగినా కనీసం ప్రతిఘటించలేదని విమర్శించారు.

Ladakh face-off: BJP hits back at Manmohan Singh
'చైనా ముందు మన్మోహన్​ లొంగిపోయారు'

By

Published : Jun 22, 2020, 2:40 PM IST

యూపీఏ హయాంలో వందల కిలోమీటర్ల భారత భూభాగాన్ని ప్రధాని మన్మోహన్​ సింగ్​ చైనాకు అప్పచెప్పారని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. 2010-13 మధ్య పొరుగు దేశం 600సార్లకుపైగా చొరబాట్లకు పాల్పడినా... మన్మోహన్​ చోద్యం చూశారని దుయ్యబట్టారు.

భారత్​-చైనా ప్రతిష్టంభన విషయంలో కేంద్రంపై మన్మోహన్​విమర్శల్ని తప్పుబడుతూ ఈమేరకు తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు నడ్డా.

"చైనాకు 43వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని అప్పగించిన పార్టీకి చెందినవారు మన్మోహన్​. సరిహద్దులో ఎన్ని పరిణామాలు జరిగినా.. కనీసం ప్రతిఘటించకుండానే యూపీఏ ప్రభుత్వం లొంగిపోవడం చాలా సార్లు చూశాం."

--- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు.

భారత సైన్యాన్ని అగౌరపరిచేలా ప్రవర్తించడాన్ని కాంగ్రెస్​ మానుకోవాలని నడ్డా సూచించారు. జాతీయ ఐకమత్యానికి నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. మన్మోహన్​ వ్యాఖ్యలకు, కాంగ్రెస్​ పార్టీ ప్రవర్తనకు పొంతన లేదని, ఇలాంటి వారి ప్రకటనలను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. భారతీయులు మోదీ వెంట ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు నడ్డా.

"మోదీని భారతీయులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. మోదీకి మద్దుతుగా నిలుస్తున్నారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన అనుభవాన్ని, తీసుకున్న నిర్ణయాలను 130కోట్ల మంది ప్రజలు చూశారు. దేశ రక్షణకు మోదీ ఇచ్చే ప్రాధాన్యాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు."

-- జేపీ నడ్డా, భాజపా అధ్యక్షుడు.

ABOUT THE AUTHOR

...view details