తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కష్టం: సైకిల్​పై 900 కి.మీ ప్రయాణం - వలస కష్టం: సైకిల్​పై 900 కిలోమీటర్ల ప్రయాణం

కరోనా నియంత్రణ కోసం దేశంలో లాక్​డౌన్ 2.0 కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక, తినేందుకు ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఛత్తీస్​గఢ్​లో చిక్కుకుపోయిన 11మంది కార్మికులు ఇల్లు చేరేందుకు సాహసమే చేశారు. 900 కిలోమీటర్లు సైకిళ్లపై ప్రయాణించి ఝార్ఖండ్​లోని స్వగృహాలకు చేరుకున్నారు.

cycle
సైకిల్​పై 900 కిలోమీటర్ల ప్రయాణం

By

Published : Apr 29, 2020, 6:50 PM IST

కరోనా లాక్​డౌన్ వేళ సొంతగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాసలు పడుతున్నారు వలసకార్మికులు. వీలైన మార్గం ద్వారా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంటికి వెళ్తే 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సి వస్తుందని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. స్వగృహాలకు చేరుకుని పరీక్షా కాలం పూర్తయిన అనంతరం తమ వాళ్లతో కలుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఝార్ఖండ్​లోని లతేహర్​లో జరిగింది. ఛత్తీస్​గఢ్​కు పనికోసం వెళ్లిన 11 మంది వలస కార్మికులు 900 కిలోమీటర్ల దూరాన్ని సైకిళ్ల ద్వారా ఛేదించారు. ఆరు రోజులపాటు సైకిల్​పై ప్రయాణించి ఇళ్లు చేరారు.

ఇదీ జరిగింది..

లతేహర్​కు చెందిన కార్మికులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలా పనికోసం ఛత్తీస్​గఢ్​కు వెళ్లారు ఆరాగూడీకి చెందిన 11మంది కార్మికులు. అయితే లాక్​డౌన్ కారణంగా పనులు ఆగిపోయాయి. ఉపాధి లేక, ఆహారం లభించక ఆకలితో అలమటించే స్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తమను రక్షించుకునేందుకు సైకిల్​పై ప్రయాణించి అయినా ఇల్లు చేరాలని అనుకున్నారు వారంతా. ఆరు రోజుల పాటు 900 కిలోమీటర్లు ప్రయాణించి లతేహర్​లోని ఆరాగూడీ గ్రామానికి చేరుకున్నారు.

ఆహారం కోసం దాచిన డబ్బుతో..

ఆహారం కోసం తమ వద్ద దాచుకున్న డబ్బుతో సైకిల్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు కార్మికులు. ఆరు రోజుల పాటు అడవి మార్గం ద్వారా ప్రయాణించి ఇల్లు చేరినట్లు వివరించారు.

ఇదీ చూడండి:ప్లాస్మా థెరపీపై ఎయిమ్స్ క్లినికల్ ట్రయల్

ABOUT THE AUTHOR

...view details