బిహార్‌లో మహాకూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఆ రాష్ట్రంలోని 40 స్థానాల్లో లాలూ ప్రసాద్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్-ఆర్జేడీ 20 స్థానాలు, కాంగ్రెస్ 9 స్థానాలు పొందాయి. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ-ఆర్‌ఎల్‌ఎస్‌పీ 5, వికాషీల్ ఇన్సాన్ పార్టీ-వీఐపీ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. హిందుస్థాన్ అవామ్ మోర్చా-హెచ్‌ఏఎమ్‌కు 3 సీట్లు కేటాయించారు.
లాలూ పార్టీ గుర్తుపై శరద్ యాదవ్ పోటీ - Lalu prasad Yadav
శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్...! ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు. బిహార్‌లో పోటీ వారిద్దరి పార్టీల మధ్యే. తర్వాత అనేక నాటకీయ మలుపులు. లోక్తాంత్రిక జనతా దళ్ పేరిట కొత్త పార్టీ పెట్టారు శరద్. ఇప్పుడు ఆ పార్టీని ఆర్జేడీలో విలీనం చేయాలని నిర్ణయించారు.
లాలూ పార్టీ గుర్తుపై శరద్ యాదవ్ పోటీ
మాజీ జనతా దళ్(యునైటెడ్) అధ్యక్షుడు, ఒకప్పటి ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్ ఆర్జేడీ నుంచి బరిలో ఉండనున్నారు. ఎన్నికల అనంతరం ఆయన పార్టీ 'లోక్‌తాంత్రిక్ జనతా దళ్-ఎల్జేడీని ఆర్జేడీలో విలీనం చేయనున్నారు.
బిహార్‌లో మొదటి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్‌ల పర్వం మార్చి 25న ముగియనుంది.
Last Updated : Mar 23, 2019, 7:50 AM IST