తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీకి అడ్వాణీ అభినందనలు - congratulations

లోక్​సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన నరేంద్ర మోదీకి భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా, కార్యకర్తలు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విజయవంతమయ్యారని కొనియాడారు.

ప్రధాని మోదీకి అడ్వాణీ అభినందనలు

By

Published : May 23, 2019, 4:30 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భాజపా వ్యవస్థాపక సభ్యులు లాల్​ కృష్ణ అడ్వాణీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ ప్రభంజనం సృష్టించేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా, ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సఫలమయ్యారని అభినందించారు.

వైవిధ్య భారతంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగటం సంతోషంగా ఉందన్నారు అడ్వాణీ. భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన సంస్థలకు అభినందనలు తెలిపారు. దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

ఇదీ చూడండి:అభివృద్ధి మంత్రం- కాశీలో మోదీ విజయనాదం

ABOUT THE AUTHOR

...view details