తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుమారస్వామి ఇంకొక్కరోజు సీఎం': సదానందగౌడ - ఈవీఎమ్​

కర్ణాటక లోక్​సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్-జేడీ(ఎస్​) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని కేంద్రమంత్రి, భాజపా నేత సదానందగౌడ జోస్యం చెప్పారు.

'కుమారస్వామి-ఇంకొక్కరోజు సీఎం': సదానందగౌడ

By

Published : May 22, 2019, 7:28 PM IST

Updated : May 22, 2019, 8:41 PM IST

'కుమారస్వామి ఇంకొక్కరోజు సీఎం': సదానందగౌడ

లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీ(ఎస్​) కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుందని కేంద్రమంత్రి, భాజపా నేత సదానందగౌడ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం (మే 24) ఉదయం వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎద్దేవా చేశారు.

"కుమారస్వామి రేపు సాయంత్రం వరకు మాత్రమే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ రోజు రాత్రి అతను సరిగా నిద్రపోలేరు కనుక రేపు లేదా ఆ మరుసటి రోజు మాత్రమే ఆయన పదవిలో ఉంటారు. కచ్చితంగా శుక్రవారం ఆయన పదవి నుంచి దిగిపోతారు."
-సదానందగౌడ, కేంద్రమంత్రి, భాజపా నేత

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమవుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ తెలిపారు. 28 లోక్​సభ స్థానాల్లో భాజపా 21 నెగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ కూటమికి ప్రతికూల ఫలితం వస్తుందని ఎగ్జిట్​పోల్స్ చెబుతున్నాయి. ఇదే జరిగితే సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. 'ఆపరేషన్​ కమల్​' పేరుతో తమలోని అసంతృప్త నేతలను భాజపా ఆకర్షిస్తోందని కాంగ్రెస్-జేడీ(ఎస్​) కూటమి ఆందోళన చెందుతోంది.

స్వపక్షంలోనే విపక్షం!

ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలను తోసిపుచ్చిన కాంగ్రెస్-జేడీ(ఎస్​) నేతలు ఈవీఎం​లు తారుమారు చేశారని ఆరోపించారు. దీనిపై అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. సుధాకర్​ తీవ్రంగా స్పందించారు. స్వపక్షంపైనే విమర్శలు చేశారు.

"వ్యక్తిగతంగా నేను అయోమయంలో ఉన్నాను. ఎగ్జిట్​పోల్స్ ఫలితాలు విడుదలయిన సమయంలోనే ఎందుకు ఈవీఎంల తారుమారు విషయం (రాజకీయ పార్టీలు) మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఎగ్జిట్​ పోల్స్​ అనేవి ఓటర్ల నాడిని తెలుపుతాయి."
-సుధాకర్​, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇదీ చూడండి: నలుగురు సుప్రీం జడ్జిల నియామకానికి కేంద్రం పచ్చజెండా

Last Updated : May 22, 2019, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details