కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ మాతో కలిసి వస్తామంటే, మేమూ చేతులు కలుపుతాం. లేదంటే మా పార్టీని మేము సొంతంగా బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతాం" అని కుమారస్వామి స్పష్టం చేశారు.
కర్ణాటక శాసనసభలో నిన్న జరిగిన బలపరీక్షలో విఫలమై.. కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ పార్టీ, తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించింది.
"కాంగ్రెస్తో పొత్తు కొనసాగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయం గురించి మాతో చర్చించలేదు. వారు కలిసి వస్తామంటే, మేమూ చేతులు కలుపుతాం. లేదంటే మా పార్టీని సొంతంగా బలోపేతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరిస్తాం." - కుమారస్వామి, జేడీఎస్ నేత
భేదాభిప్రాయాలు లేవ్