కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి మరోమారు కంటతడి పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో మండ్య ప్రజలు తన కుమారుడిని ఓడించడమే ఇందుకు కారణం. నమ్ముకున్న మండ్య ప్రజలు నిఖిల్ను ఓడించి తనను ఒంటరిని చేశారని ఆవేదన చెందారు.
కేఆర్పేట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జేడీఎస్ అభ్యర్థి బీఎస్ దేవరాజు తరఫున ప్రచారం చేపట్టారు స్వామి. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు తాను ఏమి తప్పు చేశానని ప్రశ్నించారు. పేదలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నానని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు.