పాక్ చెరలో ఉన్న భారత మాజీ నావికాధికారి కుల్‌భూషణ్‌జాదవ్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని భారత్ ప్రకటించింది. ఆమోదయోగ్యం కాని వాదనను పాకిస్థాన్ ఆయనతో చెప్పినట్లు పేర్కొంది. జాదవ్‌ను పాకిస్థాన్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కలిసిన తర్వాత విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం మేరకు భారత రాయబార కార్యాలయ అధికారులు కుల్‌భూషణ్‌ను కలిసేందుకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది. సబ్‌జైల్లో ఉన్న జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా ఆయనతో దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఈ భేటీపై పూర్తి సమాచారం అందాల్సి ఉందని తెలిపింది విదేశాంగ శాఖ. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.