తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుల్​భూషణ్ కేసు: అరెస్టు నుంచి తీర్పు వరకు... - india

కుల్​భూషణ్​ జాదవ్​ కేసులో భారత్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది హేగ్​లోని అంతర్జాతీయ న్యాయస్థానం. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం విధించిన తీర్పును నిలుపుదల చేసింది.

జాదవ్​

By

Published : Jul 17, 2019, 6:51 PM IST

కుల్​భూషణ్​ అరెస్టు నుంచి ఈరోజు వరకు జరిగిన పరిణామాలు

  • 2016 మే 3: కుల్​భూషణ్​ జాదవ్​ను అరెస్టు చేశారు.
  • 2016 మార్చి 25: జాదవ్​ అరెస్టుపై మీడియాలో మొదటిసారి వార్తొలొచ్చాయి.
  • 2016 మార్చి 29: ఇరాన్​లో కార్గో వ్యాపారం చేస్తున్న భారత మాజీ నావికదళ మాజీ అధికారి జాదవ్​ను పాక్ బలూచిస్థాన్​లో అరెస్టు చేసినట్లు ఎలాంటి అధారారాలు లేవని భారత్​ తెలిపింది.
  • 2017 ఏప్రిల్​ 10: గూఢచర్యం ఆరోపణలతో జాదవ్​కు మరణ శిక్ష విధించింది పాకిస్థాన్​ సైనిక న్యాయస్థానం. కుల్​భూషణ్ హత్యకు పాక్​ కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తంచేసింది భారత్​.
  • 2017 ఏప్రిల్ 11: జాదవ్​ను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని పార్లమెంటులో ప్రకటించారు అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్​.
  • 2017 ఏప్రిల్​ 14:కుల్​భూషణ్​పై దాఖలైన అభియోగ పత్రం, మరణ శిక్ష విధించిన తీర్పు ప్రతులను చూపాలని పాక్​ను డిమాండ్ చేసింది భారత్​.
  • 2017 మే 8: పాకిస్థాన్​ సైనిక న్యాయస్థానం తీర్పును సవాల్​ చేస్తూ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది భారత్​.
  • 2017 మే 9:జాదవ్​ మరణ శిక్షపై స్టే విధించింది అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే).
  • 2017 మే 15: అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట భారత్​-పాక్ వాడీవేడి వాదనలు వినిపించాయి. జాదవ్​ మరణ శిక్షను తక్షణమే రద్దు చేయాలని కోర్టును కోరింది భారత్​.
  • 2017మే 18: తుది తీర్పు వెలువరించే వరకు జాదవ్​ మరణ శిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్​ను ఆదేశించింది.
  • 2017 మే 29:పాకిస్థాన్​లో ఉగ్రదాడులకు జాదవ్​ వ్యూహ రచన చేశారనేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పాక్​ ఆరోపించింది.
  • 2017 జూన్​ 22:పాకిస్థాన్​ సైనిక న్యాయస్థానంలో క్షమాభిక్ష పిటిషన్​ దాఖలు చేశారు జాదవ్​.
  • 2017 జులై 2:భారత్​ తరఫు న్యాయవాది కుల్​భూషణ్​ను కలిసేందకు అనుమతి నిరాకరిచింది పాక్. ఇలా చేయడం పాక్​కు ఇది ఐదోసారి.
  • 2017 డిసెంబరు 8: తన కుటుంబ సభ్యులను డిసెంబరు 28న కలిసేందుకు జాదవ్​కు అనుమతిచ్చింది పాక్​.
  • 2017 డిసెంబరు 20:జాదవ్​ కుటుంబ సభ్యులకు వీసాలు మంజూరు చేసింది పాక్​.
  • 2017 డిసెంబరు 25: జాదవ్​ తన కుటుంబ సభ్యులను కలిశారు.
  • 2018 జులై 17:అంతర్జాతీయ న్యాయస్థానంలో రెండో కౌంటర్​ దాఖలు చేసింది పాక్​.
  • 2019 ఫిబ్రవరి 18:నాలుగు రోజుల పాటు జాదవ్​ కేసుపై ఐసీజేలో వాదనలు జరిగాయి.
  • 2019 జులై 4:జాదవ్​ కేసులో తీర్పును జులై 17కు వాయిదా వేసింది అంతర్జాతీయ న్యాయస్థానం.
  • 2019 జులై 17:భారత్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఐసీజే.

ABOUT THE AUTHOR

...view details