తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహన చట్టంపై వ్యతిరేకత.. గుజరాత్​ బాటలోనే కర్ణాటక..! - రాష్ట్రాలు

మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్​ వాహనాల చట్టంపై పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేంద్రం నిర్ణయించిన జరిమానాలను ఆయా రాష్ట్రాలు కుదిస్తూ వస్తున్నాయి. జరిమానాలను భారీగా తగ్గించిన గుజరాత్​ బాటనే అనుసరించనున్నట్లు స్పష్టం చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి.

వాహన చట్టంపై వ్యతిరేకత.. గుజరాత్​ బాటలోనే కర్ణాటక..!

By

Published : Sep 12, 2019, 6:45 AM IST

Updated : Sep 30, 2019, 7:22 AM IST

వాహన చట్టంపై వ్యతిరేకత.. గుజరాత్​ బాటలోనే కర్ణాటక..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్​ వాహనాల చట్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని పాటించడం లేదు. కేంద్రం నిర్ణయించిన జరిమానాలపై ఇటీవలే గుజరాత్​ ప్రభుత్వం పెద్దమొత్తంలో కోత విధించింది.

తాజాగా భాజపా నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం సైతం ఈ అంశంలో గుజరాత్​నే అనుసరించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప... గుజరాత్​ పాటిస్తున్న విధానాన్ని అనుసరించాలని అధికారులను ఆదేశించారు.

2019 జులై 31న మోటార్​ వాహనాల సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం కేంద్రం నిర్ణయించిన కొత్త ట్రాఫిక్​ నిబంధనలు సెప్టెంబర్​ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అయితే.. సామాన్యుడిపై భారం పడుతుందన్న అధికారుల అభిప్రాయం మేరకు.. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ప్రకటించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మహారాష్ట్రలోనూ మోటార్​ వాహనాల చట్టం అమలును.. తాత్కాలికంగా నిలిపి వేసినట్లు రాష్ట్ర రవాణా మంత్రి దివాకర్​ రావత్​ వెల్లడించారు.

నూతన ట్రాఫిక్​ నిబంధనల ప్రకారం హెల్మెట్​, సీట్​ బెల్ట్​ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

Last Updated : Sep 30, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details