కర్ణాటకలో మాదక ద్రవ్యాల ముఠాతో సినీ పరిశ్రమకు ఉన్న లింకులపై ఆరా తీయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ)ని కోరినట్లు రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఇటీవల డ్రగ్స్ ముఠా గుట్టు బయటపెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించినట్లు ఉద్ఘాటించారు బసవరాజ్. సినీప్రముఖుడు, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేశ్ ఈ విషయంలో ఆయనతో ఉన్న సమచారాన్ని పోలీసులతో పంచుకోవాలని కోరారు. ఇంద్రజిత్ తన వద్ద డ్రగ్స్ వాడుతున్న పలువురు నటుల వివరాలు ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.