తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోజికోడ్​ ప్రమాదం: 14 మంది పరిస్థితి విషమంగానే! - Kerala plane crash

కోజికోడ్​ విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో 14 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 49 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 109 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Kozhikode plane crash:
ఇంకా విషమంగానే 14మంది ఆరోగ్య పరిస్థితి

By

Published : Aug 9, 2020, 11:00 PM IST

కేరళ కోజికోడ్​లో​ జరిగిన ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో 14 మంది ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు మలప్పురం జిల్లా కలెక్టర్​ కే గోపాలక్రిష్ణ తెలిపారు. మిగతావారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

" ఇప్పటివరకు మలప్పురం, కోజికోడ్​లోని వివిధ ఆస్పత్రుల నుంచి 49 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 14 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మిగతా 109 మంది వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు."

- గోపాలక్రిష్ణ, మలప్పురం కలెక్టర్​.

విమాన ప్రమాదంలో.. పైలట్​, కో పైలట్​ సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది ప్రయాణికుల మృతదేహాలను ఇవాళ వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ల్యాండింగ్​కు​ క్లియరెన్స్​ వచ్చాకే కూలిన విమానం!

ABOUT THE AUTHOR

...view details