కేరళ కోజికోడ్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది. పైలట్ దీపక్ సాథే భౌతికకాయాన్ని ఇప్పటికే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరుసటి రోజు ముంబయి తరలించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఎయిర్ ఇండియా.
కో-పైలట్ అఖిలేష్ కుమార్ స్వస్థలమైన మథురలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులు గౌరవంగా వీడ్కోలు పలికారు.