రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీని గాంధీనగర్లోని ఆమె నివాసంలో కలిశారు. కోవింద్, ఆయన సతీమణి.. మోదీ తల్లితోఅరగంట పాటు ముచ్చటించారు. అనంతరం కోబాలో మహవీర్ జైన్ ఆరాధనా కేంద్రానికి వెళ్లి ఆచార్య శ్రీ పద్మసాగర్ సూరిజి ఆశీర్వాదాలు తీసుకున్నారు రాష్ట్రపతి దంపతులు.
మోదీ మాతృమూర్తిని కలిసిన రాష్ట్రపతి కోవింద్ - President Ram Nath Kovind Meets PM Modi's Mother in Gujarat
ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీని కలిశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సతీమణితో కలిసి గాంధీనగర్లోని హీరాబెన్ నివాసానికి వెళ్లారు కోవింద్.
![మోదీ మాతృమూర్తిని కలిసిన రాష్ట్రపతి కోవింద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4737576-925-4737576-1570953502424.jpg)
మోదీ మాతృమూర్తిని కలిసిన రాష్ట్రపతి కోవింద్
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్ మోదీతో కలిసి గాంధీనగర్లో నివాసముంటున్నారు హీరాబెన్.రెండు రోజుల పర్యటన కోసం శనివారం గుజరాత్ వెళ్లారు రాష్ట్రపతి. రాజ్భవన్లో వారికి గవర్నర్ ఆచార్య దేవ్ వ్రాత్ ఘన స్వాగతం పలికారు.
ఇదీ చూడండి: సీబీఎల్: ఆరో దశ పడవ పోటీల్లో విజేతగా 'నడుభాగం'
Last Updated : Oct 13, 2019, 3:16 PM IST