కేరళ కొట్టాయం జిల్లాలో పందెం కట్టి ఓడినందుకు గుండు కొట్టించుకున్నాడు ఓ కాంగ్రెస్ కార్యకర్త. ఇటీవలే జరిగిన పాలు నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని పందెం వేశాడు కుంజుమన్. కానీ హస్తం పార్టీ ఓడింది. ఫలితంగా కుంజుమన్ గుండు కొట్టించుకోక తప్పలేదు.
కుంజుమన్కు షాక్...
కేసీ కుంజుమన్ నలభై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే రాష్ట్రంలోని పాలు నియోజకవర్గానికి ఉపఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తన బంధువు, వామపక్ష కార్యకర్త తనోలిల్ బినోయితో ఓ పందెం కట్టాడు కుంజుమన్. తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని.. లేకపోతే గుండు కొట్టించుకుంటానని శపథం చేశాడు.