రాజస్థాన్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది.కోటా ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబరులోనే 100కి పైగా శిశువుల మృతికి సంబంధించి 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని తెలిపింది. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు.
శిశుమరణాలపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
గతంతో పోలిస్తే శిశుమరణాల సంఖ్య తగ్గిందని కోటా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు తెలిపినట్లు ఎన్హెచ్ఆర్సీ ప్రకటనలో తెలిపింది. 2019లో 963 మంది మరణిస్తే.. అంతకు ముందు సంవత్సరాల్లో ఆ సంఖ్య 1000కి పైగా ఉందని అధికారులు పేర్కొన్నట్లు వెల్లడించింది.