కోల్‌కతాలో సీబీఐ అధికారుల నిర్బంధం
ఓ చిట్‌ఫండ్ కేసులో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను విచారించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు.
కోల్‌కతా
కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటి వద్ద హై డ్రామా చోటుచేసుకుంది. చిట్‌ఫండ్ కుంభకోణంలో కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల బృందం అక్కడికి వచ్చింది. లోపలికి వెళ్లకుండా సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల మధ్య కాసేపు వాదనలు జరిగాయి. కాసేపటి తర్వాత సీబీఐ అధికారులను బలవంతంగా సమీపంలోని స్టేషన్‌కు తరలించారు కోల్‌కతా పోలీసులు.