తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓ తల్లి వేదన.. తుపానులో కొడుకులను కోల్పోయి! - latest amphan cyclone news

భారీ తుపాను 'అంపన్'​ బంగాల్​ కోల్​కతాలోని ఓ మాతృమూర్తికి తీరని శోకాన్ని మిగిల్చింది. చేతికి అందొచ్చిన ఇద్దరు కుమారులను తుపాను మింగేసి.. ఆ తల్లికి కడుపుకోత మిగిల్చింది. హల్దియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ విషాద గాథ ఎందరినో కదిలిస్తోంది.

World's most unfortunate mother- Archana Singh
'ఈ లోకంలో నా అంత దరదృష్టవతురాలైన తల్లి ఎవ్వరూ ఉండరేమో'​

By

Published : May 26, 2020, 7:42 AM IST

'ఈ లోకంలో నా అంత దురదృష్టవంతురాలైన తల్లి ఎవ్వరూ ఉండరేమో'​

ఒక్క ఘటన జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందనడానికి పశ్చిమ్​ బంగాలో విజృంభించిన అంపన్​ తుపాను నిదర్శనంగా నిలుస్తోంది. వందలాది మందిని నిరాశ్రయులను చేయడమే కాక, పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఓ అమ్మకు అయితే మహా రోదనే మిగిల్చింది.

'లోకంలో నా లాంటి దురదృష్టవంతురాలైన అమ్మ ఎవ్వరూ ఉండరేమో' అంటూ కోల్​కతాలోని హల్దియా ప్రాంతంలో నివసిస్తున్న అర్చనా సింగ్ చెప్పడం.. అందర్నీ కలచివేస్తోంది. రాష్ట్రంలో సంభవించిన అంపన్ తుపాను ప్రమాదంలో.. ఆమె తన ఇద్దరు కుమారులు రంజిత్​(18), ప్రసంజిత్​ (16)లను కోల్పోయింది. మే 20న విజృంభించిన ఈ సైక్లోన్​.. బంగాల్​​లో విధ్వంసం సృష్టించడమే కాకుండా అర్చన జీవితాన్ని తలకిందులు చేసింది.

అలుముకున్న విషాదం...

అర్చనా తన పిల్లలు, భర్తతో ఎంతో ఆనందంగా గడిపేది. ఆ రోజు సాయంత్రం కూడా అందరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. తీరా నిద్రపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. అదేంటో తెలుసుకునే లోపే వారుంటున్న గుడిసెపై ఓ చెట్టు అమాంతం పడిపోయింది. భర్తకు మతిస్థిమితం లేనప్పటికీ.. తనను కాపాడాడని అర్చన తెలిపింది. కానీ తమ పిల్లలను రక్షించుకోవడంలో విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది. చేతికందొచ్చిన పుత్రులు కళ్లముందే చనిపోయినందుకు కన్నీరు మున్నీరయ్యింది. రాష్ట్రప్రభుత్వం నుంచి పరిహారం లభించినప్పటికీ.. కొడుకులు లేరనే బాధ తమను కలచివేస్తోందని అంటోంది అర్చన.

ABOUT THE AUTHOR

...view details