తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జులై 1 నుంచి మెట్రో సర్వీసుల పునరుద్ధరణ! - బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

జులై 1 నుంచి మెట్రో సర్వీసులను పునఃప్రారంభించాలని అనుకుంటున్నట్లు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అలాగే రాత్రి పూట కర్ఫ్యూలో కాస్త సడలింపులు ఇచ్చారు. ప్రస్తుతం జులై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉంది.

Kolkata Metro may resume services from 1 July: Mamata
జులై 1 నుంచి మెట్రో సర్వీసుల పునరుద్ధరణ!

By

Published : Jun 26, 2020, 8:24 PM IST

బంగాల్​​లో మెట్రో సర్వీసులను జులై 1 నుంచి పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కానీ అందరూ కూర్చొనే వెళ్లాలని, ఏ ఒక్కరికీ నిల్చునే అవకాశం లేకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. రాత్రి కర్ఫ్యూలో కాస్త సడలింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు.

"జులై 1 నుంచి కర్ఫ్యూను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించాం. మెట్రోలో అన్ని ముందు జాగ్రత్తలను పాటిస్తూ, పూర్తి స్థాయిలో శానిటైజ్​ చేస్తూ, 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీ విధానంలో మాత్రమే జులై 1 నుంచి మెట్రో సేవలను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం.''

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది.

ఒకవేళ సర్వీసులు ప్రారంభమైతే మాత్రం అధిక రద్దీ లేకుండా, ప్రయాణికులు ఎవరూ నిల్చొకుండా చూసే బాధ్యత మెట్రో అధికారులదేనని స్పష్టం చేశారు.

జులై 31 వరకు..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జులై 31 వరకు లాక్​డౌన్​ను​ పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు మమతా.

ఇదీ చూడండి:బంగారం ధరలు మరింత ప్రియం.. 10 గ్రా. ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details