రుచి, ఆరోగ్యం కలగలిపిన ఎర్ర చీమల పచ్చడి..! సాధారణంగా మన ఇళ్లలో చీమలు కనిపిస్తే వాటిని నివారించటానికి అనేక ఉపాయాలు ఆలోచిస్తాం. కానీ ఝార్ఖండ్‌లోని ధన్బాద్లో రంగనిభట్ట గ్రామం దీనికి భిన్నం. ఇక్కడి గిరిజన ప్రజలు ఎర్ర చీమల పచ్చడిని లటుక్కున పట్టుకొని వాటిని రోకలితో నూరి.. పచ్చడి చేసి తినేస్తారు.
అదేంటీ అనుకుంటున్నారా..! ఈ చీమలను తినడం వల్ల అనేక వ్యాధులు దరి చేరవని, ఇందులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని వారి నమ్మకం. అంతేకాదు ఇదెంతో ప్రత్యేకమైన అహారంగా భావిస్తారు.
కోడా ఆదివాసీలు
ఝార్ఖండ్‌లోని ధన్బాద్లో కోడా ఆదివాసీలు దాదాపు ఐదు, ఆరు తరాలు నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. పూర్వీకుల నుంచి ఈ ఆహార సంప్రదాయం కొనసాగుతోంది.
బెమౌట్ చీమలు
ఈ చీమలను అక్కడి ప్రజలు బెమౌట్ చీమలుగా పిలుస్తారు. ఇది వారికి చాలా రుచికరమైన వంటకం. చీమలను, వాటి గుడ్లతో తయారుచేసిన పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు. చిన్ని చిన్ని కొమ్మలు, ఆకులపై గుట్టలు గుట్టలుగా అధిక సంఖ్యలో ఈ చీమలు గుడ్లు పెడతాయి.
పరిశోధన అవసరం ఎంతైనా ఉంది?
ఇలా చీమలు తినటం వల్ల మనుషులకు ప్రయోజనం ఉందా.. లేదా హాని కలిగిస్తుందా అన్న దానిపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
"ఈ చీమలలో ప్రొటీన్ అధిక మొత్తంలో లభిస్తుంది. అందువల్ల ఇక్కడి ప్రజలను ఆహారంగా ఈ చీమలని తీసుకుంటారు. ఇందులో రోగ నిరోధకశక్తి ఎంత ఉందో అలాగే మానవ శరీరానికి హాని కలిగించే పదార్థం ఏదైనా ఉందా అనేది పరిశోధన చేయాల్సి అవసరం ఉంది."
-జంతుశాస్త్ర ఆచార్యులు, కోయలాంచల్ విశ్వవిద్యాలయం.
ఇదీ చూడండ : ట్రాఫిక్ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!