వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమిళనాడులో రైతులు వినూత్న రీతిలో నిరనస వ్యక్తం చేశారు. తిరుచురాపల్లి కలెక్టర్ కార్యలయం వద్ద పుర్రెలు పట్టుకుని, చేతులు కట్టేసుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
'బిల్లు'పై దేశవ్యాప్తంగా ఆందోళనలు- పోలీసులు అప్రమత్తం - రైతలు ఆందోళనలు
12:54 September 25
11:22 September 25
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా బిహార్‌లో రైతులు చేపట్టిన నిరసనల్లో పాల్గొని తేజస్వీ యాదవ్ ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ట్రాక్టర్ టాప్‌పై కూర్చున్నారు.
10:20 September 25
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమని ధ్వజమెత్తారు ఆర్జేజీ నేత తేజస్వీ యాదవ్. కేంద్రానికి నిధులు సమకూర్చేవారికి ప్రయోజనం చేకూర్చడం కోసం అన్నదాతలను కీలుబొమ్మలుగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం చెప్పిందని.. కానీ ఈ బిల్లులతో రైతులు ఇంకా నిరు పేదలవుతారని తేజస్వీ మండిపడ్డారు.
బిహార్‌లో నిరసనలు చేపట్టిన రైతులకు మద్ధతుగా ట్రాక్టర్ నడిపారు తేజస్వీ.
09:49 September 25
ఆర్జేడీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకిస్తూ బిహార్‌లో ఆర్జేడీ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. గేదెలపై సవారీ చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
09:39 September 25
కర్ణాటకలో నిరసనలు..
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కర్ణాటక-తమిళనాడు రహదారిపై బొమ్మనహల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ఆధ్యర్యంలో రైతులు నిరసన తెలిపారు.
09:28 September 25
అమృత్సర్- దిల్లీ జాతీయ రహదారిపై రాస్తారోకో
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌ఎంపిఐ) ఆధ్వర్యంలో రైతులు పంజాబ్ జలంధర్‌లోని ఫిలౌర్ సమీపంలో అమృత్సర్- దిల్లీ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
09:14 September 25
పోలీసుల ఆధీనంలో అమృత్సర్
రైతుల ఆందోళనల నేపథ్యంలో అమృత్‌సర్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి క్రాస్‌రోడ్ వద్ద భద్రతా దళాలను మోహరించారు. నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
08:57 September 25
పోలీసుల మోహరింపు
దేశవ్యాప్తంగా శుక్రవారం రైతుల నిరసనల నేపథ్యంలో పంజాబ్ లుథియానాలోని జాతీయ రహదారిపై పోలీసు సిబ్బందిని మోహరించారు అధికారులు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు అధికారులు.
07:46 September 25
రైతుల ఆందోళనల నేపథ్యంలో హరియాణా నుంచి పంజాబ్ వెళ్లాల్సిన రైళ్లను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు అధికారులు.
07:39 September 25
శాంతియుతంగా చేపట్టండి..
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలను రైతులు శాంతియుతంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు.
06:59 September 25
రైతుల ఆందోళనలు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కూడా రైల్‌రోకోకు దిగారు రైతులు.