తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కిసాన్ నిధి అర్హులను గుర్తించండి: కేంద్రం - 'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి'

'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' పథకానికి అర్హులైన వారిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది. మార్చి చివరినాటికి లబ్ధిదారుల ఖాతాల్లోకి మొదటి విడతగా రూ.2 వేలు నగదు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కేంద్రం

By

Published : Feb 2, 2019, 6:59 PM IST

'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' పథకం కింద అర్హులైన సన్న, చిన్నకారు రైతులను గుర్తించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి లబ్ధిదారుల ఖాతాల్లోకి మొదటి విడతగా రూ.2 వేలు నగదు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని నీతి ఆయోగ్​ ఉపాధ్యక్షుడు రాజీవ్​ కుమార్​ తెలిపారు. 2019 మధ్యంతర బడ్జెట్​లో రైతులకు పంటసాయం కోసం రూ.75,000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లను కేంద్రం పంటసాయం కింద రైతులకు నగదు బదిలీ చేయనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అర్హులైన సుమారు 12 కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూరనుంది.

నీతి ఆయోగ్​ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్​ మాట్లాడుతూ, 'పీఎమ్​- కిసాన్​ నిధి' పథకాన్ని సమర్థవంతంగా అమలుచేస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో మినహాయించి మిగతా దేశమంతా ఈ పథకం అమలుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో పథకం అమలుకు కొంచెం సమయం పట్టే అవకాశముందన్నారు. అక్కడ ప్రత్యామ్నాయ మార్గాల్లో పథకాన్ని అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో భూ వివరాలు డిజిటలైజ్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఉత్తరప్రదేశ్​లో డిజిటలైజేషన్​ పూర్తయ్యిందని రాజీవ్​ తెలిపారు. ఫిబ్రవరి నాటికి భూ వివరాలు డిజిటలైజ్​ అయిన రైతులు 'పీఎమ్​-కిసాన్​ సమ్మాన్​' పథకానికి అర్హులని రాజీవ్​ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details