తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి! - ఉత్తరప్రదేశ్​లో ఇద్దరు చిన్నారు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని​ ముండాపాండే గ్రామంలో విషాదం జరిగింది. నలుగురు పిల్లలు ఆడుకుంటూ కారులో చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఊపిరాడక మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Kids get locked in car, two die of suffocation in UP
కారు లోపల చిక్కుకొని ఇద్దురు చిన్నారులు మృతి

By

Published : Jun 16, 2020, 5:22 PM IST

నలుగురు పిల్లలు ప్రమాదవశాత్తు ఓ కారు లోపల చిక్కుకుపోగా... అందులో ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా నాలుగు నుంచి ఏడేళ్ల లోపు వారేనని వెల్లడించారు పోలీసులు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ముండాపాండే గ్రామంలో జరిగింది.

ఏం జరిగింది?

వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం ఆదివారం సెకండ్​ హ్యాండ్​ కారును కొనుగోలు చేసింది. వారింట్లో ఉన్న నలుగురు చిన్నారులు సోమవారం మధ్యాహ్నం ఆడుకుంటూ ఆ కారు డోర్​తీసి లోపలికి వెళ్లారు. అనంతరం.. కారు డోర్​ లాక్​ అవడం వల్ల బయటకు రాలేక చిక్కుకుపోయారు. బయటకువెళ్లిన చిన్నారులు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. పిల్లలు కారులో ఉన్నట్లు గుర్తించారు. ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉన్న వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.

పిల్లలు.. కారు లోపల రెండు గంటలు చిక్కుకుపోయి, ఆక్సిజన్ లేకపోవడం వల్లే ఉక్కిరిబిక్కిరి అయ్యారని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:భారత్​, చైనా సైనికుల ఘర్షణ- ముగ్గురు జవాన్ల మృతి

ABOUT THE AUTHOR

...view details