తినుబండారాల ప్యాకెట్‌లో వచ్చే ఆట బొమ్మ ఓ బాలుడి పాలిట శాపమైంది. పొరపాటున గొంతులో ఇరుక్కుని ఆ చిన్నారి మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
స్నాక్స్ ప్యాకెట్ 'బొమ్మ' వల్ల బాలుడు మృతి - Madhya Pradesh Latest news
మధ్యప్రదేశ్‌లో తిను బండారాల ప్యాకెట్‌లో వచ్చే బొమ్మ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. నీముచ్ జిల్లా కెంపూరియా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
నీముచ్ జిల్లా కెంపూరియా గ్రామంలో ఓ బాలుడు స్నాక్స్ ప్యాకెట్ కొన్నాడు. అందులో స్నాక్స్‌తో పాటు అతడికి ఒక విజిల్ వచ్చింది. ఆ బాలుడు స్నాక్స్ తింటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో విజిల్ బాలుడికి గొంతులో ఇరుక్కుపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లినా వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. అనంతరం బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అధికారులు ఆ ఆహార పదార్థాల పరిశ్రమను సీజ్ చేశారు. 1800 ప్యాకెట్లను సీజ్ చేశారు.
ఇదీ చూడండి : ఆలోచన సూపర్ : బడిలో ప్రత్యేక 'నీటిగంట'
TAGGED:
Madhya Pradesh Latest news