దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారంటూ ఆమెను తొలుత జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించింది. అనంతరం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు.
దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సోనియాకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు ఖుష్భూ. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తోన్న తన లాంటి వ్యక్తులకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తీవ్రంగా ఆలోచించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం లేని నేతల పెత్తనం నచ్చక పార్టీని వీడుతున్నట్లు ఖుష్బూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
భాజపా గూటికి..