ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 'మన్ కీ బాత్'లో నీట్, జేఈఈ పరీక్షల గురించి ప్రస్తావించకపోవటంపై మండిపడ్డారు. మనసులో మాట కార్యక్రమంలో 'పరీక్ష పే చర్చ' చేపట్టాలని విద్యార్థులు కోరుకుంటే.. ప్రధాని అసలు విషయం వదిలి బొమ్మలపై మాట్లాడారని విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహించే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' పూర్తయిన తర్వాత ఈ మేరకు వ్యాఖ్యానించారు రాహుల్.
" జీఈఈ-నీట్ అభ్యర్థులు ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ చేపట్టాలని కోరుకున్నారు. కానీ, ప్రధాని బొమ్మలపై చర్చించారు. మనసులో ఉన్నది కాదు, విద్యార్థుల గురించి మాట్లాడండి."