తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా సీఎంగా రేపు ఖట్టర్​ ప్రమాణ స్వీకారం - రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఖట్టర్​

హరియాణాలో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖట్టర్​ ఎంపికయ్యారు. గవర్నర్​ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నారు ఖట్టర్​. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

భాజపా శాసనసభాపక్ష నేతగా ఖట్టర్​ ఎంపిక ఏకగ్రీవం

By

Published : Oct 26, 2019, 2:37 PM IST

Updated : Oct 26, 2019, 6:32 PM IST

హరియాణా సీఎంగా రేపు ఖట్టర్​ ప్రమాణ స్వీకారం

హరియాణా భాజపా శాసనసభాపక్ష నేతగా మనోహర్​లాల్​ ఖట్టర్​ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని శనివారం జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ప్రకటించారు కేంద్రమంత్రి రవిశంకర్​. ఈ సమావేశానికి రవిశంకర్​తో పాటు భాజపా సాధారణ కార్యదర్శి అరుణ్​ సింగ్​ హాజరయ్యారు. హరియాణా ముఖ్యమంత్రిగా ఖట్టర్​ పేరును ఎమ్మెల్యే అనిల్​ విజ్​ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను సమావేశంలోని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

హరియాణా ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ఖట్టర్. గవర్నర్​ సత్యదేవ్​ నరైన్​ ఆర్య వద్దకు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని అభ్యర్థించనున్నారు​. ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఖట్టర్.

90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో భాజపా 40 సీట్లు దక్కించుకుంది. స్వతంత్రులు, జేజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కాషాయ దళం.

'కండా మద్దతు మాకొద్దు...'

వివాదాస్పద నేత, లోక్​హిత్​ పార్టీ ఎమ్మెల్యే గోపాల్​ కండా మద్దతును భాజపా తిరస్కరించిందని రవిశంకర్​ ప్రకటించారు. శనివారం జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

2012లో ఓ మహిళను బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రరేపించారని కండాపై ఆరోపణలున్నాయి. తాజా ఎన్నికల అనంతరం... భాజపాకు మద్దతు ప్రకటించారు గోపాల్​ కండా. ఆయన మద్దతును కమలం పార్టీ అంగీకరించేందుకు తొలుత సిద్ధపడింది. ఈ విషయంపై విపక్షం సహా సొంత పార్టీ నుంచే కాషాయ దళానికి వ్యతిరేకత ఎదురైంది.

ఇదీ చూడండి:- దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం

Last Updated : Oct 26, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details