జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు, పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చారిత్రక సందర్భమని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కశ్మీర్ అంశంపై వరుస ట్వీట్లు చేశారు ప్రధాని. సంకెళ్ల నుంచి విముక్తి పొంది నూతన శకం కోసం ఎదురుచూస్తోందన్నారు.
"ఐక్యంగా మనం 130 కోట్ల ప్రజల కలలను నిజం చేసుకోగలం. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది చారిత్రక రోజు. అత్యధిక మెజారిటీతో కశ్మీర్ బిల్లులు ఆమోదం పొందాయి."