తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జాలి' లేని జాలీ - వరుస హత్యల కేసులో నేరాంగీకారం

కేరళ కోజికోడ్ జిల్లా కూడథాయ్ వరస హత్యల కేసులో నిందితులు నేరం అంగీకరించారు. 14 ఏళ్ల సుదీర్ఘకాలంలో అత్తింటి వారి తరఫు బంధువులు ఆరుగురిని హత్య చేసిన 'జాలీ' అనే మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు విడుదల చేశారు.

'జాలి' లేని జగత్​కిలాడి - వరస హత్యల కేసులో నేరాంగీకారం

By

Published : Oct 7, 2019, 9:18 PM IST

Updated : Oct 8, 2019, 11:43 AM IST

సంచలనం సృష్టించిన కేరళ కోజికోడ్ జిల్లా కూడథాయ్ వరస హత్యల నిందితురాలు 'జాలీ' తన నేరాన్ని అంగీకరించింది. ఆస్తి కోసం అత్యంత కుట్రపూరితంగా హత్య చేసింది తానేనంటూ పోలీసుల వద్ద ఒప్పుకొంది.

14 ఏళ్ల పాటు అత్తింటి తరఫు బంధువులు ఆరుగురిని హత్య చేసిన జాలీ వాంగ్మూలాన్ని పోలీసులు విడుదలచేశారు.

ఆస్తి కోసం అత్త, మామ, సొంత భర్తను కూడా వదలకుండా విషం పెట్టి చంపిన జాలీ దురాగతాలను ఆమె మరిది ఫిర్యాదు మేరకు 17 ఏళ్ల తర్వాత ఛేదించారు పోలీసులు.

జాలీ వాంగ్మూలం మేరకు ఆమె రెండో భర్త షాజును పిలిచి విచారించారు రక్షకభటులు. హత్యలను అంగీకరించిన షాజు తన భార్య జాలీనే ఈ దారుణాలు చేసిందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక ఉపాధ్యాయుడిగా తాను ఈ విషయంలో సహకరించి ఉండకూడదని షాజు వాపోయారని సమాచారం. పోలీసులకు చెబితే తనను కూడా జాలీ హత్య చేసే అవకాశం ఉందని షాజు భయపడినట్లు పోలీసు వర్గాల కథనం.

ఈ మేరకు విచారణలో నిందితులిద్దరు వెల్లడించిన విషయాలతో పోలీసులు ప్రకటన విడదల చేశారు.

ఇదీ చూడండి: ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు, ఏం జరిగింది..?

Last Updated : Oct 8, 2019, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details