తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓనమ్​ ప్రత్యేకం​: ప్రతీకార కథతో స్నేహపూర్వక కుస్తీ - ఓనమ్​ ప్రత్యేకం

కేరళ ఓనమ్​ పండగలో క్రీడలు కూడా భాగమే. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓనతల్లు అనే స్నేహపూర్వక కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. వయసు భేదం లేకుండా వీటిని జరుపుకొంటారు.

స్నేహపూర్వక కుస్తీ

By

Published : Sep 12, 2019, 4:21 PM IST

Updated : Sep 30, 2019, 8:45 AM IST

స్నేహపూర్వక కుస్తీ

కేరళలో ఓనమ్​ పండగను ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఆధ్యాత్మికతతో పాటు క్రీడలకు సమప్రాధాన్యం ఉంటుంది. ఓనమ్​ వేడుకల్లో భాగంగా అక్కడ జరిగే పడవ పోటీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అదే తరహాలో కొన్ని ప్రాంతాల్లో 'ఓనతల్లు'.. స్నేహపూర్వక కుస్తీని నిర్వహిస్తారు.

ఓనతల్లు అంటే..

ఓనమ్​, తల్లు(పోరు) రెండు పదాల కలయిక. ఈ సంప్రదాయ కుస్తీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. పాలక్కాడ్​ జిల్లా పల్లసాన ఈ కుస్తీకి పుట్టినిల్లు. గతంలో పల్లసాన పాలకుడిని కుతిరవట్టత్తు రాజు చంపేశాడు. ఈ కారణంతో కుతిరవట్టత్తుపై పల్లసాన ప్రజలు యుద్ధానికి దిగారు. ఈ పోరును స్మరించుకుంటూ ఓనతల్లును నిర్వహిస్తారు.

చిన్న నుంచి పెద్ద వరకు..

ఈ కుస్తీలో పాల్గొనేందుకు వయసుకు పరిమితులేమీ ఉండవు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాల్గొంటారు. ఈ ఆటలో ఇద్దరు పరస్పరం తలపడతారు. ఒక వ్యక్తిని మిగతా వారు పట్టుకుంటారు. ప్రత్యర్థి వెనకనుంచి గట్టిగా కొట్టాలి. ఉరుమినట్టు శబ్దం వస్తే కొట్టినవారు గెలిచినట్లు.. లేదా దెబ్బతిన్న వారు గెలుస్తారు.

మన్నడియార్​ ప్రజలు ఈ కుస్తీలను తిరువోనమ్ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. ఊరుకుడి, ఈళుకుడి ప్రజలు అవిట్టమ్​ (ఓనమ్ మూడో రోజు)న జరుపుకొంటారు. దెబ్బలు గట్టిగా తగిలుతున్నా సంప్రదాయాన్ని వదిలిపెట్టలేమని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ముంబయి లాల్​బాగ్​ గణేశ్​ నిమజ్జనంలో కోలాహలం

Last Updated : Sep 30, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details