తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేపాల్​ రోడ్లపై కేరళ ఆటోలు చక్కర్లు - Kerala Minister EP Jayarajan

భారత్​కు చెందిన ఆటోలు త్వరలో నేపాల్​ వీధుల్లో దర్శనమివ్వనున్నాయి. 'కేరళ నీమ్​ జీ' వాహనాల కోసం తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది ఆ దేశం. తొలి దశలో భాగంగా.. 500 ఆటోలు పంపాలని కంపెనీని కోరింది.

Kerala's 'Neem G electric auto rickshaws' to hit Nepal's roads
త్వరలోనే నేపాల్​ రోడ్లపై కేరళ ఆటోలు

By

Published : Oct 21, 2020, 7:05 PM IST

కేరళలో తయారైన ఎలక్ట్రిక్​ ఆటోలు త్వరలోనే నేపాల్​ రోడ్లపై తిరగనున్నాయి. ఈ మేరకు కేరళ ఆటో మొబైల్​ లిమిటెడ్​(కేఏఎల్​) ఉత్పత్తి చేస్తున్న 'కేరళ నీమ్​ జీ' వాహనాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది హిమాలయ దేశం​. ఇందులో భాగంగా తొలుత 500 ఆటోలను పంపాలని కోరింది. అయితే తొలి దశలో 25 ఆటోలు ఆ దేశానికి వెళ్లనున్నాయి. వీటిని తీసుకెళ్లే ట్రక్​.. తిరువనంతపురం నుంచి బయల్దేరి 12 రోజుల్లో నేపాల్​కు చేరుకోనుంది.

బంగ్లా, లంక దేశాలు కూడా..

'నీమ్​ జీ' వాహనాలకు ఉన్న డిమాండ్​తో బంగ్లాదేశ్​, శ్రీలంకలు కూడా కేఏఎల్​ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇంకా అవి చర్చల దశలోనే ఉన్నట్టు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాలు కూడా ఈ-ఆటోల కోసం కేఏఎల్​ను సంప్రదించాయి.

కొవిడ్​ రిలీఫ్​ ప్యాకేజీలో భాగంగా ఆ కంపెనీకి రూ. 5కోట్లు కేటాయించనున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఈ.పీ.జయరాజన్​ తెలిపారు. స్వయం సహాయక బృందాల సహకారంతో.. రాష్ట్రంలోని మహిళలకూ 'నీమ్​ జీ' ఆటోలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

7,200 ఆటోల ఉత్పత్తి లక్ష్యం..

ఏటా 7,200 ఎలక్ట్రానిక్​ ఆటోలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేఏఎల్​. ఒక్క ఆటో ధర రూ. 2,85,000. అయితే.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 30,000 సబ్సిడీ లభిస్తోంది.

ఇదీ చదవండి:రెండు చేతులతో పెయింటింగ్​- పెన్సిల్​ ఆర్ట్స్​లోనూ ప్రతిభ

ABOUT THE AUTHOR

...view details