నేటి తరంలో ప్రతి ఫోజుకో సెల్ఫీ.. ప్రతి కొత్త లుక్కుకు ఓ ఫొటో.! పిక్ ఏదైనా సరే.. దిగిన మరుక్షణమే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేయాల్సిందే. కానీ.. కేరళలో ఓ వృద్ధ జంట ఇందుకు భిన్నం. వివాహమై 50ఏళ్లు దాటినా ఇంతవరకు ఇద్దరూ కలిసి ఒక్క ఫొటో కూడా దిగలేదట. అయితే ఇటీవలే ఆ లోటు తీర్చుకున్నారు కుంజుట్టి, చిన్నమ్మ దంపతులు. పెళ్లైన 58 ఏళ్ల తర్వాత వారు జరుపుకున్న ఈ ఫొటోషూట్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటోషూట్ - Photoshoot pose
కేరళలో ఓ వృద్ధ జంటకు 1962లో వివాహమైంది. అయితే.. ఇంతవరకూ అందుకు సంబంధించిన ఫొటో జ్ఞాపకాలేవీ లేవని ఫీలవుతున్న వేళ.. తమ మనుమడి సాయంతో ఇటీవలే ఓ ఫొటోషూట్ నిర్వహించారు. ఇప్పుడే పెళ్లైందా అన్నట్టుగా దిగిన ఆ వృద్ధ దంపతుల ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
![వైరల్: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటోషూట్ Wedding photoshoot after 58 yrs of marriage goes viral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9044760-thumbnail-3x2-photoshoot.jpg)
వైరల్: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటో షూట్
1962 జనవరి 1న కుంజుట్టి, చిన్నమ్మలకు వివాహమైంది. అయితే.. అప్పట్లో ఫొటోగ్రాఫర్ అందుబాటులో లేకోనో, మరే ఇతర కారణంగానో పెళ్లిలో ఫొటోలు దిగలేదట. ఆ కోరికను ఇప్పుడు తమ మనుమడి సాయంతో తీర్చుకుని.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇప్పుడే పెళ్లైన జంటగా దిగిన ఈ వృద్ధుల ఫొటోషూట్ చూస్తే.. కరోనా కాలంలోనూ ఇంత గొప్పగా వివాహం జరిగిందా? అనిపించక మానదు.
ఇదీ చదవండి:కళకళలాడే కశ్మీర్ అందాల్లో 'పాంపోర్' కుంకుమపువ్వు