తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు

లాక్​డౌన్​లో ఎంతమంది తమలోని ప్రతిభ, సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కేరళకు చెందిన ఓ చిత్రకారుడు.. ప్రజల భావోద్వేగాలను కళాఖండాల రూపంలో గీస్తూ అందర్ని ఆకర్షిస్తున్నారు. ఆ చిత్రాలు ప్రజల లాక్​డౌన్​ జీవితాలకు అద్దం పట్టేలా ఉన్నాయి.

Kerala: This artist showcases life during lockdown period
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు

By

Published : May 15, 2020, 7:26 AM IST

కరోనా సంక్షోభ కాలంలో ఎంతోమంది చిత్రకారులు, కళాకారులు తమలోని ప్రతిభను బయటపెడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కేరళలోని తిరుర్​కు చెందిన 78 ఏళ్ల సావియర్​ చిత్రకూడం.. లాక్​డౌన్​ కష్టాలను తనదైన సృజనాత్మకతతో పెయింటింగ్స్​గా మలిచారు.

మనసును హత్తుకునేలా..

మనుషుల జీవితాలను తన సొగసైన కళాఖండాల ద్వారా అభివర్ణిస్తున్నారు సావియర్​. భావోద్వేగాలకు తన కుంచెతో రూపాన్నిస్తున్నారు. ఆకర్షణీయ రంగులతో పరిస్థితులను కళ్లకు కట్టేలా ప్రదర్శిస్తున్నారు. లాక్​డౌన్​లో ప్రజల దీనగాథలను.. తన కళతో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అందుకే ఆయన గీసిన చిత్రాలు చూపరులను కదలిస్తున్నాయి, లోతుగా ఆలోచింపజేస్తున్నాయి.

ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు

ఆదరణ కరవై..

సావియర్​ అభిరుచులకు ఎలాంటి దన్ను లభించకపోవడం వల్ల తన చిన్నతనంలోనే కుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. గత 22 ఏళ్లుగా తిరుర్​లోనే చిత్రకారుడిగా పని చేస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా ఆయన గీసిన చిత్రాలను ప్రదర్శించడానికి వీలుకావడం లేదు. అందుకే పేపరుపైనే చిత్రాలు గీస్తున్నారు సావియర్​. రోజువారీ వార్తలు, పలు కార్యక్రమాలే తన చిత్రాలకు ఆదర్శమని ఆయన చెబుతున్నారు.

ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు

"ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ఇతర కార్మికులను ప్రశంసించడమే నా పని." - సావియర్, చిత్రకారుడు.

చిత్రాలను గీయడం నేర్చుకోవాలనే ఆసక్తి చూపించే యువతకు సావియర్​ సలహాలు, సూచనలు ఇస్తూ... తన కళను పది మందికి పంచుతున్నారు.

ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు
ఆయన కళాఖండాలు.. లాక్​డౌన్​ కష్టాలకు ప్రతిరూపాలు

ఇదీ చూడండి: మాల్యాకు మరో షాక్​- భారత్​కు అప్పగింత ఖాయం!

ABOUT THE AUTHOR

...view details