దుకాణదారు: రూ.1300 అవుతుంది.
కస్టమర్ :ప్రతి ఎన్నికలకు మీ దగ్గరేగా తీసుకునేది... రూ.1000కి ఇవ్వండన్నా.
దుకాణదారు:సరే డబ్బులివ్వండి.
ఇది కేరళ త్రిస్సూర్ జిల్లా పుత్తేన్పల్లిలోని ఓ దుకాణంలో ఎన్నికల సీజనంతా కనిపించే దృశ్యం.
దుకాణదారు: రూ.1300 అవుతుంది.
కస్టమర్ :ప్రతి ఎన్నికలకు మీ దగ్గరేగా తీసుకునేది... రూ.1000కి ఇవ్వండన్నా.
దుకాణదారు:సరే డబ్బులివ్వండి.
ఇది కేరళ త్రిస్సూర్ జిల్లా పుత్తేన్పల్లిలోని ఓ దుకాణంలో ఎన్నికల సీజనంతా కనిపించే దృశ్యం.
'కేరళ ఫ్యాన్సీ' పేరుతో 30 ఏళ్లుగా జమాల్ అనే వ్యక్తి వివిధ పార్టీల ప్రచార సామగ్రి తయారు చేస్తున్నారు. కాంగ్రెస్, సీపీఎం, భాజపా... ఇలా ఏ పార్టీ కార్యకర్తలైనా ఇక్కడికి వచ్చి కొనాల్సిందే.
ఈసారి ఎన్నికలకు భారీ ఎత్తున టీషర్టులు, కండువాలు, జెండాలు, రాజకీయ నాయకుల మాస్కులు తయారు చేశారు. చిరకాల శత్రు పార్టీల నాయకుల ఫొటోలు, పార్టీల కండువాలు ఒకేచోట కొలువుదీరి ఉంటాయిక్కడ. ఇలాంటి దృశ్యం ఇక్కడతప్ప మరెక్కడా కనిపించదు.
"మేము ఈ దుకాణాన్ని 30 ఏళ్ల క్రితం ప్రారంభించాం. ఇంతకుముందు ప్రచార సామగ్రి కోసం వస్త్రాలు వాడేవాళ్లం. ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నాం. మా దగ్గర జెండాలు, బెలూన్స్, మాస్కులు మొదలు... ఏ ప్రచార సామగ్రి అయినా దొరుకుతుంది. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కార్యకర్తలు ఎక్కువ మంది వస్తున్నారు. భాజపా అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం వల్ల మాకు కొంత నష్టం వాటిల్లింది. ఏదైనా ప్రచార సామగ్రి మిగిలినా వచ్చే ఎన్నికలకు వాడతాం. అది కూడా నాయకులు వేరే పార్టీ కండువా కప్పుకోకపోతేనే సాధ్యం."
- జమాల్, 'కేరళ ఫ్యాన్సీ' యజమాని
కేరళ ప్రముఖ నాయకులైన ఏకే గోపాలన్, ఈఎంఎస్ నంబూద్రీపాద్, నెహ్రూ నుంచి నేటితరం నాయకులైన మోదీ, రాహుల్ గాంధీ టీషర్టులు, పోస్టర్లు అమ్మకానికి పెట్టారు. కాషాయ జెండాలు, ఎరుపు జెండాలు, మువ్వన్నెల జెండాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి.
ఇవీ చూడండి:భారత్ భేరి: అందరి చూపు ఆ స్థానాలపైనే